Homeహైదరాబాద్latest Newsమత్తుపదార్థాల వాడకంతో జీవితం చిత్తు.. దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్తు

మత్తుపదార్థాల వాడకంతో జీవితం చిత్తు.. దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్తు

ఇదే నిజం, మధిర: మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మధిర పిలుపునిచ్చారు. జూన్ 26 న మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత/విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు పట్టణాలు, మండలాలలోని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు విస్తృత స్ధాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహణలో భాగంగా మొదటి రోజు మధిర హై కేర్ హాస్పిటల్ నుండి మెయిన్ రోడ్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ముగించారు.

ఈ కార్యక్రమాలలో ప్రజలు, యువకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొని మార్కాదవ్యాల దుర్వినియోగం మత్తు పదార్థాల వాడక నిర్మూలనకు, మత్తుజ్ రహిత మధిర మండలాన్ని చూడాలని భావనతో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సంధ్య, ఎక్స్చేంజ్ శాఖ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img