Homeహైదరాబాద్ఎల్లప్పుడూ సమాజ సేవలో లయన్స్ క్లబ్

ఎల్లప్పుడూ సమాజ సేవలో లయన్స్ క్లబ్

ఈసీఐఎల్​, ఇదేనిజం : సమాజ సేవలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఎల్లప్పుడూ ముందుంటుందని సెకండ్ వైస్ గవర్నర్ లయన్ చింతల వెంకట నారాయణ రెడ్డి అన్నారు.

లయన్స్ క్లబ్ ఇఁటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320సి పూర్వపు గవర్నర్ లు లయన్ రవీంద్రనాథ్ గుప్త, లయన్ బి ఆర్ రావు ల జన్మదిన సందర్భంగా చేపట్టిన సేవా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతము కరోనా మహమ్మారి విజురంబిస్తున్న సమయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఈసిఐల్ ఎలైట్, లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఇండస్ట్రియలిస్ట్స్, లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ భావన సభ్యులు సంయుక్తంగా ముందుకు వచ్చి షుమారు లక్ష రూపాయలు వెచ్చించి లాలాపేట్, శాంతినగర్ లోని విద్యా మందిరం ఉపాధ్యాయులకు 30 మందికి ఒక నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణి చేయడం నిజంగా గర్వించదగ్గ విషయము అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ లయన్ ఇన్నారెడ్డి, రీజియన్ చైర్ పర్సనులు లయన్ ములవర్తి శ్రీనివాస రావు, లయన్ రమేష్, జోన్ చైర్ పర్సన్లు జైపాల్ రెడ్డి, ఎం న్ చారి, రఫీక్ అహమద్, కో ఆర్డినేటర్ లు హనుమంత రావు, హేమాద్రి రావు, రమణ రావు విశ్వేశ్వర రావు, రవి కుమార్, డాక్టర్ శ్రీనివాస కుమార్, జయలక్ష్మి, హరిహర సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img