Homeహైదరాబాద్latest Newsలయన్స్ క్లబ్ నూతన కార్యవర్గప్రమాణ స్వీకారం

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గప్రమాణ స్వీకారం

ఇదేనిజం, రాయికల్: రాయికల్ పట్టణంలోని ఆర్ ఆర్ గార్డెన్ లో లయన్స్ క్లబ్ 12వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ మోర బద్రేశం, రీజియన్ చైర్ పర్సన్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి హాజరై నూతన అధ్యక్షులుగా మచ్చ శేఖర్, ప్రధానకార్యదర్శిగా కడకుంట్ల నరేష్, కోశాధికారిగా కట్ల నర్సయ్య, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, కుర్మా సుదర్శన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా దాసరి గంగాధర్, బొడగం అంజిరెడ్డి, బొమ్మకంటి నవీన్, సుధవేని మురళి, కొయ్యేడి మహిపాల్ రెడ్డి, పారిపెళ్లి శివ ప్రసాద్ లచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించడంలో రాయికల్ లయన్స్ క్లబ్ ముందు వరుసలో ఉందని.. శుద్ధ నీటి కేంద్రం, బాడీ ఫ్రీజర్ లాంటి శాశ్వత సేవలతో పాటు భవిష్యత్తులో నిరుపేద ప్రజలకు ఉపయోగపడే మరిన్ని శాశ్వత సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, జోన్ చైర్పర్సన్ గడ్డం శంకర్ రెడ్డి, ఎక్స్టెన్షన్ చైర్ పర్సన్ ఆడెపు మధు, గుంటుక చంద్రప్రకాశ్, ప్రవీణ్, మాజీ జోన్ చైర్పర్సన్ మ్యాకల రమేష్, బత్తిని భూమయ్య, కాటిపెళ్లి రాంరెడ్డి, డాక్టర్ ఉదయ్ కుమార్, మాజీ అధ్యక్షులు ఆదిరెడ్డి, కోశాధికారి గంట్యాల ప్రవీణ్, ఎంజెఎఫ్ సభ్యులు గంప ఆనందం, ఇందూరి గంగాధర్, సభ్యులు వాసం స్వామి, వాసం ప్రసాద్, కట్కం కళ్యాణ్, కొత్తపెళ్లి రంజిత్, ఆడెపు రాంప్రసాద్, నిమ్మల వెంకట్ రెడ్డి, జక్కుల చంద్రశేఖర్, ఎలిగేటి అనీల్, సామల్ల గోపాల్, బెక్కెం తిరుపతి, జిల్లాల సూర్యం రెడ్డి, సాంబారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img