liquor: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీ మే 12 వరకు పొడిగించారు. కస్టడీ ముగియడంతో సీబీఐ కోర్టులో మనీష్ సిసోడియాను అధికారులు హాజరుపరిచారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. సిసోడియా కస్టడీ పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ అధికారులు కోరారు.
సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకుని.. సిసోడియా కస్టడీని నాగ్ పాల్ ధర్మాసనం పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తీహార్ జైలులో మనీష్ సిసోడియా ఉంటున్నారు.