ఏపీలో గత ప్రభుత్వం చేసిన మద్యం కుంభకోణం ఇప్పుడు తెరపైకి వచ్చింది. దశలవారీ మద్యనిషేధం ముసుగులో మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చిన ‘జగన్ అండ్ కో’. దాన్ని అడ్డుపెట్టుకుని అతి పెద్ద కుంభకోణానికి తెరలేపింది. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ గుప్పిట పెట్టుకుని ఐదేళ్లలో భారీగా దోచుకుంది. రూ.వేల కోట్ల విలువైన ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు జగన్‌మోహన్‌రెడ్డి కాగా. వైసీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలు కీలకంగా వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి.