మద్యం దుకాణాల లైసెన్స్ కోసం బుధవారం రాత్రి వరకు 57,709 దరఖాస్తులు వచ్చాయి. అయితే రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ప్రభుత్వానికి రూ.1154.18 కోట్ల ఆదాయం వచ్చింది. నేడు, రేపు కూడా అవకాశం ఉండడంతో మరో 40 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 2 దుకాణాలకు అత్యధికంగా 217 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 4,420, ఏలూరులో 3,843, విజయనగరంలో 3,701 దరఖాస్తులు నమోదుయ్యాయి.