Homeహైదరాబాద్latest Newsవరల్డ్ లో మోస్ట్ లేజీ కంట్రీస్ లిస్ట్.. అందులో మన కంట్రీ ప్లేస్ ఏంటో తెలుసా..?

వరల్డ్ లో మోస్ట్ లేజీ కంట్రీస్ లిస్ట్.. అందులో మన కంట్రీ ప్లేస్ ఏంటో తెలుసా..?

లేజీ కంట్రీస్ అంటే బద్దకస్తులు ఎక్కువగా ఉండే దేశాలు అని అర్థం. అయితే ప్రతి సంవత్సరం అనేక అధ్యయనాలు మరియు నివేదికలు విడుదలవుతాయి. తాజా స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయన ఫలితాలు విడుదలయ్యాయి. ఇది ప్రపంచ శారీరక శ్రమ స్థాయిలలో జరిగింది. అంటే ఏయే దేశాల ప్రజలు శారీరకంగా చురుగ్గా ఉంటారు అనే అంశంపై ఓ అధ్యయనం జరిగింది. అయితే 46 దేశాల్లోని దాదాపు ఏడు లక్షల మంది నుంచి డేటాను సేకరించి అధ్యయనం పూర్తి చేశారు.
ఈ అధ్యయనంలో ప్రపంచంలోనే అత్యధిక శాతం సోమరిపోతులు ఉన్న దేశం ఇండోనేషియా అని కనుగొంది. ఇండోనేషియాలోని ప్రజలు ఒక రోజులో 3513 అడుగులు మాత్రమే వేస్తారు. అంటే తక్కువ నడిచే మనుషులున్న దేశం ఇది. ఈ దేశం రద్దీగా ఉంది. అలాగే మౌలిక సదుపాయాల సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది. ఇండోనేషియా తర్వాత సౌదీ అరేబియా ఉంది. సోమరుల దేశంలో రెండో స్థానంలో నిలిచింది. సౌదీ అరేబియాలోని ప్రజలు రోజుకు 3807 అడుగులు మాత్రమే నడుస్తారు. ఆ తర్వాత, సోమరితనం దేశాల్లో మలేషియా మూడో స్థానంలో నిలిచింది. ఈ దేశ ప్రజలు ఒక రోజులో 3963 అడుగులు వేస్తారు. ఇంకా రోజుకు 4008 అడుగులతో ఫిలిప్పీన్స్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్ లో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో ఉంది. రోజుకు 4105 అడుగులు మాత్రమే రికార్డ్ చేస్తోంది. ఆ తర్వాత స్థానాలలో ఈజిప్ట్ మరియు బ్రెజిల్ ఉన్నాయి.
ఇక మన దేశంలోని ప్రజలు రోజుకు 4297 అడుగులు వేస్తారని అధ్యయనం కనుగొంది. పట్టణీకరణ, జీవనశైలి మార్పుల కారణంగా ప్రజలు నడవడం తక్కువేనని ఈ అధ్యయనం చెబుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో రోడ్లు నడవడానికి వీల్లేదని తెలిపింది. నడక కోసం సమయం కేటాయించండి. భారతదేశంలో శారీరక శ్రమను ప్రోత్సహించడానికి అవగాహన అవసరమని ఆ డేటా సూచిస్తుంది.

Recent

- Advertisment -spot_img