Homeహైదరాబాద్latest NewsLIVE : 'ఏపీలో లిక్కర్, శాండ్ మాఫియా నడుస్తోంది' : ప్రధాని మోదీ

LIVE : ‘ఏపీలో లిక్కర్, శాండ్ మాఫియా నడుస్తోంది’ : ప్రధాని మోదీ

అసెంబ్లీ ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లోనూ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రానుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలోనూ ఎన్డీయే కూటమి అధికార పగ్గాలు చేపడుతుందని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని అభిప్రాయపడ్డారు.

” వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి గణనీయంగా జరిగింది. కాంగ్రెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఝార్ఖండ్‌లో ఓ కాంగ్రెస్ మంత్రి పీఏ సహాయకుడి దగ్గర గుట్టలుగుట్టలుగా నోట్లకట్టలు బయటపడ్డాయి. నల్లధనాన్ని పట్టుకుంటే కాంగ్రెస్ నేతలు నాపై విమర్శలు చేస్తారు. అవినీతిపరులు దోచుకున్న డబ్బును పేదప్రజలకు పంచేలా న్యాయసలహాలు తీసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఏపీలో లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా నడుస్తోంది”.

– ప్రధాని మోదీ

Recent

- Advertisment -spot_img