ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గన్నవరంలోని అంబాజీపేటలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు కేవలం ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు మాత్రమే కాదని..అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన చంద్రబాబును ఓడించేందుకు కూడా అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించుకోవాలని కోరారు.
” ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ 99 శాతం అమలు చేశాం. జగన్‌ను ఓడించాలని అందరూ ఏకమయ్యారు. చంద్రబాబు, పవన్, రామోజీ, రాధాకృష్ణ వంటి వ్యక్తులు ప్రజల్ని దోచుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. 2 లక్షల 70 వేల కోట్లు రూపాయలు డీబీటీ (Direct Benefit Transfer ) కింద పంపిణీ చేశాం. టీడీపీ ప్రభుత్వం 32 వేల ఉద్యోగాలిస్తే , మా ప్రభుత్వం రెండు లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చింది. 55 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిచాం. 31 లక్షల ఇళ్ల పట్టాలను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాం. 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.
గతంలో అధికారంలోకి వచ్చేముందు టీడీపీ ఇచ్చిన హామీలు.. 87612 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని చెయ్యలేదు , పొదుపు సంఘాల రుణాలన్నీ రూ. 14205 కోట్ల రుణాలు రద్దు చేస్తామని చెయ్యలేదు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ. 25000 ఇస్తామని ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి కింద రూ. 2016 ఇస్తామని ఇవ్వలేదు. ప్రత్యేక హోదా తేలేదు. ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు, పవన్, మోదీని నమ్ముతారా?
పథకాలన్నీ నేరుగా ఇంటికే రావాలన్నా..లంచాలు లేని పరిపాలన రావాలన్నా…వ్యవసాయం మెరుగుపడాలన్నా…ప్రతీ ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాను గుర్తు మీద నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 కు 25 ఎంపీ స్థానాలు వైసీపీకి రావాలి, తగ్గేదే లేదు.
ఎమ్మెల్యేగా పార్టీ తరఫున వేణు పోటీ చేస్తున్నాడు. గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశాడు. ఎంపీ అభ్యర్థిగా ప్రసాద్ నిలబడుతున్నాడు. మీ చల్లని దీవెనలతో ఇద్దర్నీ గెలిపించాలి. మీ ఇంట్లో మీ బిడ్డలకు మంచి జరిగి ఉంటే వైసీపీకి ఓటేయ్యండి. మీరే అండగా నిలబడండి. ధన్యవాదాలు”.
– జగన్