రేపల్లెలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు మోసం చేస్తారని విమర్శించారు. 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా..మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్టు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖిని నిద్ర లేపడమే, కొండచిలువ నోట్లో తలపెట్టడమేనంటూ ఘాటైన విమర్శలు చేశారు.
” 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మ్యానిఫెస్టోలో 99 శాతం అంశాలు అమలు చేశాం. ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు ఇవి. రాబోయే ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు ఇవి. ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేశ్, ఎంపీ అభ్యర్థిగా సురేశ్ పోటీ చేస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను”.