HomeజాతీయంLK Advani - The Architect of Hindutva Politics : రామ్​ రథయాత్రతో బీజేపీకి...

LK Advani – The Architect of Hindutva Politics : రామ్​ రథయాత్రతో బీజేపీకి స్వర్ణయుగం

LK Advani – The Architect of Hindutva Politics :

  • హిందూత్వ వాదానికి మూలదిక్కై నిలిచాడు

  • దేశ వ్యాప్తంగా కాషాయ పతాకం రెపరెపలు

  • కాంగ్రెస్​కు ధీటుగా బీజేపీని నిలిపిన చరిత్ర

  • 92 ఏండ్ల వయసులోనూ పార్టీ కోసమే ఆలోచన

  • పార్టీలో తన ప్రాధాన్యత తగ్గించిన.. అవమానించినా చిరునవ్వే

బీజేపీ కురువృద్ధుడు ఎల్​కే అడ్వాణీ జీవితం మొత్తం పోరాటమే. ఆయన బీజేపీని ప్రాణం పోశారు. రెండు సీట్ల జన్​సంఘ్​ని దేశ వ్యాప్తంగా విస్తరించడంతో అడ్వాణీ కృషి వెలకట్టలేనిది.

రామజన్మభూమి సమస్య ఈ రోజు సాకారం అయ్యేందుకు ఆయన ఎన్నో పోరాటాలు.. మరెన్నో త్యాగాలు..ఇంకెన్నో ఎదురుచూపుల తర్వాత రామ మందిర నిర్మాణ కల సాకారం అయింది.

1992 డిసెంబర్‌ 6 నాటి బాబ్రీ మసీజు కూల్చివేత కేసుకూడా తెమలడంతో ఎల్​కే అడ్వాణీతోపాటు ఆనాడు రథయాత్రలో పాల్గొన బీజేపీ నాయకులు సంతోషపడుతున్నారు.

రామ్​లల్లా ఆశీర్వాదంతోనే ఇన్నాళ్లకు న్యాయం గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు.

బీజేపీ విస్తరణకు 30 ఏండ్ల కింద బీజమేశాడు

రాముని జన్మస్థలంలో గుడి కట్టడంతోపాటు బీజేపీని బలోపేతం చేసేందుకు LK Advani రథయాత్ర పాత్ర ఎంతోఉంది.

రామజన్మ భూమి వివాదం తలెత్తుకోవడంతోనే బీజేపీ కాంగ్రెస్​ కంచుకోటకు బీటలు పడేలా చేసింది. ఈనాడు మోడీ రెండుసార్లు సొంతంగా పాలన సాగిస్తుదంటే ఆనాడు అడ్వాణీ చేసిన కృషి ఫలితమే.

ఇదే విషయాన్ని బీజేపీ నేతలు సైతం కాదనలేరు.

 

30 ఏండ్ల కిందట. లాల్ కృష్ణ అద్వానీ అప్పుడు నాటిన విత్తనం.. ఇప్పుడు మొలకెత్తుతోంది. మోడీ హయంలో బీజేపీ బలోపేతం అయిన మాట వాస్తవమే అయినా పార్టీ విస్తరణలో LK Advani పాత్రను తూచలేము. ఎవరి చూపు వారిదే. ఎవరి సామర్థ్యం వారిదే.

బీజేపీకి మోడీ కంటే ముందు అడ్వాణీయే పెద్దదిక్కుగా ఉండి అన్ని తానై నిలిచి పార్టీని నిలిపారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏకతాటిపై హిందూత్వవాదులను చేర్చిన ఘనత

రథయాత్రకు సారథ్యం వహించడంతోపాటు హిందూత్వ వాదానికి నాయకత్వం వహించే ప్రతి ఒక్కరిని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత అడ్వాణీకే దక్కుతుంది.

కాంగ్రెస్​ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చడం, వారి సమస్యలను దేశ వ్యాప్తంగా లేవనెత్తడం, ఇవే కాకుండా దేశ వ్యాప్తంగా పర్యటించి ఆయా ప్రాంతాల్లో బీజేపీ నాయకత్వంలో జోష్​ నింపారు.

సోమనాథ్ ఆలయం నుంచి మొదలైన రథయాత్ర LK Advani జీవితాన్నే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది.

అయోధ్య రథయాత్ర సమయంలో బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్న అడ్వాణీ అన్ని తానై రథయాత్రను ముందుకు నడిపాడు.

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990 సెప్టెంబర్ 25న యాత్ర ప్రారంభమైంది. అయోధ్యలో రామ మందిరాన్నినిర్మించేందుకు ప్రజల మద్దతు పొందడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగింది.

రోజుకు సుమారు 300 కి.మి. చొప్పున .. 10,000 కిలోమీటర్లు ప్రయాణించి అక్టోబర్ 30న అయోధ్య చేరుకునేలా యాత్ర మొదలైంది.

వందలాది గ్రామాలు, పట్టణాల మీదుగా అద్వానీ పర్యటన సాగింది. ఈ యాత్రలో వేల సంఖ్యలో కర సేవకులు వెంట నడిచారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహారణ

గుజరాత్ తరువాత LK Advani మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో సాగింది. ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్‌ సరిహద్దులు దాటిన వెంటనే అద్వానీని అరెస్టు చేయాల్సిందిగా నాటి ప్రధాని వీపీ సింగ్‌ బిహార్‌ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌కి సూచించారు.

అక్టోబర్‌ 23న అద్వానీని, నాటి వీహెచ్‌పీ అధినేత అశోక్‌ సింఘాల్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. వీపీ సింగ్‌ నేతృత్వంలోని LK Advani అక్టోబర్‌ 23న అరెస్ట్‌ అయిన వెంటనే బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వాణీ రాష్ట్రపతికి లేఖ రాయడంతో రాజకీయాలు ఒక్కసారీగా మారిపోయాయి.

దీంతో అటు కేంద్రంలో వీపీ సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం..మరో వైపు టు లాలూ ప్రసాద్‌ నేతృత్వంలోని బిహార్‌ ప్రభుత్వం రెండూ ఒకేసారి కుప్పకూలాయి.

అప్పుడే ప్రధాని అయ్యేవారు. కానీ..

1990 నవంబర్‌ 7న సింగ్‌ ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసాన్ని కోల్పోయింది. కాంగ్రెస్‌ మద్దతుతో చంద్రశేఖర్‌ ప్రధాని కాగా.. 16 నెలలకే దిగిపోయారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి.

రామ్​ రథయాత్ర పరిణామాల తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు పెద్ద ఎత్తున అంచనాలు వినిపించాయి. బీజేపీ గెలుపు ఖాయమని.. LK Advani ప్రధాని అవుతారని అంచనా వేసారు.

దేశ వ్యాప్తంగా జరిగిన ఓటింగ్​ సరళి కూడా ఇదే విషయాన్ని సూచించింది. కానీ అనుహ్యంగా మొదటి దఫా ఎన్నికలు పూర్తయిన మే 20వ తేదీ మర్నాడే తమిళనాడులో ఒక ఎన్నికల బహిరంగ సభలో ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌గాంధీ ప్రాణాలు కోల్పోయారు.

ఈ దుర్ఘటన తరువాత రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తదుపరి ఎన్నికల తేదీలు జూన్‌ మధ్య వరకూ వాయిదా పడ్డాయి.

జూన్‌ 12, 15 తేదీల్లో తదుపరి దశ జరిగాయి. రాజీవ్​ మరణం తర్వాత కాంగ్రెస్​ పార్టీపై ప్రజలకు సెంటిమెంటు పెరిగింది. దీంతో ఆ ప్రభావం ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది.

కాంగ్రెస్‌కు మొదటి విడత పోలింగ్​లో తగ్గిన సీట్లను రాజీవ్​ మరణం తరువాత జరిగిన పోలింగ్​ ద్వారా భర్తీ అయింది.

తొలి విడత 211 సీట్లకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ అతికొద్ది స్థానాలనే దక్కించు కోగలిగింది. జూన్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు తగిన సీట్లను సంపాదించి పెట్టాయి.

ఫలితంగా కేంద్రంలో పీవీ నరసింహారావు నేతృత్వంలో మైనారిటీ సంకీర్ణం ఏర్పడింది. ఇక, ఆ తరువాత జరిగిన పరిణామాల్లో బీజేపీ క్రమేణా ఎదుగుతూ మోదీ నాయకత్వంలో వరుసగా రెండో సారి కేంద్రంలో అధికారం దక్కించుకునేంత బలంగా మారింది.

ఇప్పుడు పార్టీలో తన పాత్రను పరిమితం చేసిన, ఎన్నో సందర్భాల్లో అవమాన పరిచినా.. ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న నాయకులపై వీసమంతైనా కోపం తెచ్చుకోరు. కాలం మారిందని, అందుకు అనుగుణంగా పార్టీలోనూ మార్పులు సహజమని ఆయన భావిస్తారు.

పైగా తాను నీరు పోసి పెంచిన బీజేపీ పార్టీ బలంగా మారిందని సంతోషం వ్యక్తం చేస్తారు. ఇదే తనకు నిజమైన తృప్తినిస్తదని ఎన్నో సందర్భాల్లో అడ్వాణీ తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img