‘హైడ్రా’ కూల్చివేతలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ప్రభుత్వానికి సూచించారు. పెద్దలను వదిలి పేదల కట్టడాలను కూలిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రికార్డుల ప్రకారం ఎంతటివారినైనా వదిలిపెట్టకుండా హైడ్రా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కించాలని రఘునందన్ అన్నారు.