లోన్ యాప్ ల వేధింపుల తాళలేక ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్ లైన్ లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ. కోటి జరిమానా విధించేలా ముసాయిదాను సర్కారు రూపొందించింది. ఇది అమలైతే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్ లు అప్పులు ఇవ్వడం ఇక కుదరదు.