రూ.2లక్షలకు పైబడి రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయ శాఖ బ్యాంకులకు లేఖ రాసింది. రెండు లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని ప్రభుత్వం వసూలు చేసుకోవాలని స్పష్టత నివ్వడంతో అదనపు మొత్తం చెల్లించేందుకు రైతులకు అవకాశం లభించింది. అదనపు మొత్తం చెల్లిస్తే వారికి ఎప్పుడు రుణమాఫీ చేస్తామనేది ప్రభుత్వం ఇంకా స్పష్టతనివ్వలేదు.