Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా..!

రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా..!

రుణమాఫీ కానీ రైతులు అధైర్య పడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్‌గేట్‌లో నూతనంగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌కు ఘనస్వాగతం పలికేందుకు సభ ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా అర్హులైన రైతులకు రుణమాఫీ చేసే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో కేవలం రూ. లక్ష రుణమాఫీ.. నాలుగుసార్లు చేసిందని.. అవి రైతుల మిత్తిలకు కూడా సరిపోదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ చేసి చూపించారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 22 లక్షల మందికి రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.

Recent

- Advertisment -spot_img