తెలంగాణలో రుణమాఫీ, రైతు భరోసా కోసం రైతులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మనందరికీ తెలిసిందే. అందులో రుణమాఫీ పథకం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రుణమాఫీ 4 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. నాలుగో విడత రూ. 2,747.67 కోట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే చాలా మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకే రేషన్‌కార్డు కలిగి ఉండి కుటుంబంలో ఇద్దరు రుణమాఫీ అర్హత ఉన్న వారికి ఇప్పటి వరకు కాలేదని రైతులు పేర్కొంటున్నారు. మాకూ త్వరగా రుణమాఫీ విడుదల చేయాలని కోరుతున్నారు. మిగిలిన రైతులకు ఐదో విడతలో అందించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.