పెద్దపల్లి పట్టణంలోని పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని కోరుతూ పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.