Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ సరే.. రైతుభరోసా ఏది..? అసలు ఇస్తారా..? ఇయ్యరా..?

రుణమాఫీ సరే.. రైతుభరోసా ఏది..? అసలు ఇస్తారా..? ఇయ్యరా..?

  • వరినాట్లు ప్రారంభమైన ఊసేలేని రైతు భరోసా
  • పెట్టుబడి సాయం కోసం అన్నదాతల ఎదిరిచూపులు

ఇదేనిజం, లక్షెట్టిపేట: ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఏడాదికి 15 వేలు పంటలకు పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. దీనిని ఈ ఏడాది నుండే అమలు అమలు చేస్తామని ప్రకటించింది. కానీ సాగు పనులు ప్రారంభమై వరి నాట్లు వేసే దశకొచ్చిన ఇంత వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. రుణ మాఫీ ప్రకటనలతో జోరు మీదున్న ప్రభుత్వం రైతు భరోసా పథకం ఊసెత్తక పోవడంతో పెట్టుబడి సాయం అందుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొన్నది. రైతాంగం మాత్రం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబందు పేరుతో ఎకరానికి 5 వేల చొప్పున ఏడాదికి రెండు సీజన్ లలో కలిపి 10 వేలు అందజేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనినే కొనసాగించి మొన్నటి ఎండాకాలం సీజన్లో అందజేసింది. రైతు భరోసా కింద ఎకరానికి 15 వేలు ఇవ్వాల్సి ఉంది. పెట్టుబడి సాయం ఇంకా అందక పోవడంతో రైతులే సొంతంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసుకుంటున్నారు. చిన్న, సన్నకారు పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వరికి బోనస్ ఉత్తమాటేనా..?
ఎన్నికలకు ముందు వరికి రూ. 500లు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత కేవలం సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ఇటీవల ప్రకటించింది. దీంతో రైతులంతా దొడ్డు రకాలను వదిలేసి సన్నాల వైపు మల్లారు. ఎక్కువగా బీపీటీ లాంటి రకాల సాగుకు సిద్దమయ్యారు. కనీసం ఈ సీజన్లో పండించిన దాన్యానికి బోనస్ వస్తుందో, లేదోనని చాలా మంది రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పక్కాగా లెక్కలు తీసి..
శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర పద్ధతుల ద్వారా సాగు చేస్తున్న భూములను పక్కాగా కొలవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ విధివిధానాలు రూపొందించేడెప్పుడో.. రైతులకు రైతు భరోసా పడేదెప్పుడో.. అని రైతులు చర్చించుకుంటున్నారు.

రైతుబందు డబ్బులే రుణమాఫీ చేసిండు- పాదం శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు

ప్రభుత్వం రైతుబందు డబ్బులనే రుణమాఫీకి మల్లించింది. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైన రైతుబందుపై విధివిధానాలు రూపొందించక రైతులను ఇబ్బంది పెడుతున్నారు. చాలా మంది పేద రైతులు వడ్డీ వ్యాపారులు, విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో అప్పు చేసి ఎవుసం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రైతు బంధు విడుదల చేయాలి.

అనర్హుల ఏరివేతకే ఆలస్యం- పింగిళి రమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనర్హులకు రైతు బందు మంజూరు చేసింది. ధనవంతులకు కాకుండా నిజమైన పేద రైతుకే ఇవ్వాలని రైతుల నుండి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాభిప్రాయం సేకరించింది. త్వరలోనే రైతులకు రైతు భరోసా అందిస్తాం.

రైతు భరోసా తొందరగా ఇవ్వాలి- చిప్పకుర్తి నారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, అంబేద్కర్ యువజన సంఘం

బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో రైతులు ఎక్కువగా వడ్డీ వ్యాపారులు, దుఖాణ దారులపై ఆధార పడి విత్తనాలు, ఎరువులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు పెట్టుబడి సాయం అందేలాగా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా దళిత, గిరిజన రైతులను ఆదుకోవాలి.

Recent

- Advertisment -spot_img