Local elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థులకు షాక్ ఇవ్వనుంది. ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా ‘నోటా’ను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ విధానం హరియాణా, మహారాష్ట్రలో అమల్లో ఉంది. దీనిపై ఈ నెల 12న రాజకీయ పార్టీలతో చర్చించనుంది. అయితే రాజకీయ పార్టీలు అంగీకరించినా.. ప్రభుత్వం అంగీకరిస్తుందో లేదో వేచి చూడాలి.