Homeహైదరాబాద్latest Newsబ్లాస్టింగ్ తో ఇబ్బంది పడుతున్న స్థానికులు

బ్లాస్టింగ్ తో ఇబ్బంది పడుతున్న స్థానికులు

ఇదే నిజం, రామగిరి : RG3 ఏరియాలోని ఉపరితల గని OCP2 వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రాజాపూర్ గ్రామ రైతులు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. దుమ్ము, ధూళితో అనారోగ్యం పాలవుతున్నామన్నారు. గనిలో చేసే బ్లాస్టింగ్ వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోయారు. ఇటీవల 88.20 ఎకరాల భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఒకవేళ భూసేకరణ అనివార్యమైతే తమ ఇళ్ల స్థలాలు కూడా తీసుకొని వేరే చోట స్థలాలు ఇవ్వాలని విన్నవించారు. సింగరేణి జీఎం, ఇతర అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎండీ వారికి నచ్చచెప్పారు. రామగిరి ఎంపిపీ ఆరెళ్ళి దేవక్క కొమరయ్య గౌడ్, పౌరసమాచార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగం రాజయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లేల కొమురయ్య తదితరులు పాల్గొన్నార

Recent

- Advertisment -spot_img