ఇదే నిజం, బుగ్గారం : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెలుగొండ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వర్టు లేకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దోమలు అధికమవుతన్నాయని వాపోతున్నారు. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామన్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.