వచ్చే నెల ఒకటో తేదీ నుంచి లాక్‌డౌన్ ఎత్తివేతకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
తొలుత ఉజ్జయినిలో అన్‌లాక్ మొదలవుతుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచనాప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
బుధవారం ఉజ్జయిని చేరుకున్న ముఖ్యమంత్రి చౌహాన్.. ఈ నెల 31 వరకు కఠినమైన లాక్‌డౌన్ ఉంటుందని చెప్పారు.
జూన్ 1 నుంచి జిల్లాలు క్రమంగా తెరుస్తారని తెలిపారు.
పరిమిత సంఖ్యలో వివాహ వేడుకలకు అనుమతించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు.
థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజలను సన్నద్ధం చేయడానికి ప్రణాళికలు మొదలుపెడుతున్నారు.
కరోనా మహమ్మారి పరిస్థితిలను ఉజ్జయినిలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌమాన్ సమీక్ష జరిపారు.
సమావేశంలో బ్లాక్ ఫంగస్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ ఫంగస్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించే మందులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కు గురైన రోగులకు మంచి చికిత్స అందించాలని ఆదేశించారు.
కరోనా కర్ఫ్యూను వచ్చే నెల 31 వరకు 11 రోజులు కఠినంగా అమలు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు నెమ్మదిస్తున్నాయని, అలాగే డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అనాథ చిన్నారులను ఆదుకునేందుకు జిల్లాల కలెక్టర్లు జాబితాలు సిద్ధం చేయాలని, అలాగే, తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.