తెలంగాణలో కరోనా కేసుల అంతకంతకు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం దిశగా కేసీఆర్ సర్కార్ అడుగులేసింది.
తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరిగింది.
ఈ భేటీలో లాక్‌డౌన్‌పై మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
లాక్‌డౌన్ వల్ల సాధకబాధకాలు, ఇతర ఇబ్బందులు వంటి అంశాలపై కూడా చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగింది.
మొదటగా 10 రోజులపాటు లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం.
ఇక లాక్డౌన్లో అత్యవసర, నిత్యావసరాల సమస్యలు తీర్చేందుకు పలు సడలింపులు ఇచ్చే విషయమై నియమావళిని రేపు ప్రకటించనున్నారు.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు గలదు.
వ్యాక్సిన్ వేసుకునేందుకు వెళ్ళు వారికి లాక్‌డౌన్ నిబంధనలు వర్తించవు.