తెలంగాణలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ఈ రోజు తో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం 625 నామినేషన్లు ఆమోదించినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 893 మంది 1,488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. 268 మంది అభ్యర్థులకు చెందిన 428 సెట్లు తిరస్కరించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.