తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదు. కాబట్టి ఇక్కడ గాజు గ్లాస్ గుర్తుతో సమస్య లేదు. అందుకే స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గాజు గ్లాస్ గుర్తు పై కూడా ఇదే గందరగోళం నెలకొంది. తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి.