లోక్‌సభ ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఆరో విడత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ సెంటర్లో తమ ఓటు వేశారు. పొత్తులో భాగంగా న్యూఢిల్లీ నుంచి బరిలో ఉన్న ఆప్ ఎంపీ అభ్యర్థి సోమనాథ్ భారతికి వీరు మద్దతిచ్చారు. దీంతో తొలిసారి కాంగ్రెసేతర పార్టీకి ఓటేయాల్సి వచ్చింది. వీరిద్దరూ ఇప్పటివరకు కాంగ్రెస్‌కు తప్ప ఇతర పార్టీకి ఓటేయలేదు.
కాగా, ఉదయం 11 వరకు 58 స్థానాల్లో 25.76% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 36.88% నమోదు కాగా, ఒడిశాలో అత్యల్పంగా 21.30% ఓట్లు పోలయ్యాయి. జార్ఖండ్‌లో 27.80%, ఉత్తరప్రదేశ్‌లో 27.06%, బీహార్‌లో 23.67%, జమ్ముకశ్మీర్‌లో 23.11%, హర్యానాలో 22.09%, ఢిల్లీలో 21.69% పోలింగ్ నమోదైంది.