Homeమరిన్నిPoliticsLokesh CID Enquiry adjourned to 10th of this month లోకేశ్​ సీఐడీ విచారణ...

Lokesh CID Enquiry adjourned to 10th of this month లోకేశ్​ సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా

– 41 ఏ నిబంధనలు సవాల్​ చేసిన లోకేశ్​

ఇదేనిజం, ఏపీ బ్యూరో: ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో నారా లోకేశ్​ సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది. ఈ మేరకు సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను నారా లోకేష్ హైకోర్టులో సవాల్ చేశారు. లోకేశ్​ ఇచ్చిన లంచ్ మోషన్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. లోకేశ్​ ప్రస్తుతం హెరిటేజ్‌లో షేర్ హోల్డర్ అని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని తెలిపారు. లోకేష్‌ను ఇవి అడగడం సమంజసం కాదని సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, రేపే (బుధవారం) విచారణకు హాజరుకావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు చేసింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img