– చంద్రబాబు ప్రజా నాయకుడు అంటూ వ్యాఖ్య
– తన తల్లినీ బెదిరిస్తున్నారని ఆవేదన
ఇదేనిజం, హైదరాబాద్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కంటతడి పెట్టుకున్నారు. తన తండ్రి చంద్రబాబు ప్రజా నాయకుడని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. చివరకు తన తల్లిని కూడా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నార్నారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో లోకేశ్ అధ్యక్షతన టీడీపీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా లోకేశ్ భావోద్వేగంగా ప్రసంగించారు. ఏపీ కోసం అహర్నిశలు కష్టపడిన ప్రజా నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులు పూర్తి చేసిన చంద్రబాబును అక్రమంగా బంధించారని ఆరోపించారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో లోకేశ్ అధ్యక్షతన టీడీపీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ‘2019లో ఒక్క ఛాన్స్ అంటే జగన్‌ను గెలిపించారు. నియంత మాదిరిగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి తోసేశారు. సైకో జగన్ మొదటి నిర్ణయం.. ప్రజల కోసం కట్టిన ప్రజావేదిక కూల్చడం. దళితులు, బీసీలు, మైనారిటీలు, అనేకమంది టీడీపీ నేతలపై కేసుల పెట్టారని ఆరోపించారు.