Lokesh Kanagaraj : ”నగరం” సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన చేసిన లోకేష్ కనకరాజ్.. ఆ తరువాత వరుస సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ”కూలీ” అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున నెగెటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్ట్ 14న అన్ని భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కూలీ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యే వరకు నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాను.. తరువాత కలుద్దాం అప్పటి వరకు నేను సెలవులో ఉన్నాను అని పోస్ట్ పెట్టాడు.