ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: నాయకుల పై అభిమానం వ్యక్తం చేయడం పట్ల పలు రకాల విధానలు చూసాం కానీ, ఆ యువకుడు భారత ప్రధాని నరేంద్ర మోడిపై ఉన్న వీరాభిమాన్నాన్ని వినుత్నంగా చూయిస్తున్నాడు. మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన యువకుడు ఇట్టేడి గంగారెడ్డి తలపై కమలం పువ్వు గుర్తు మాత్రమే ఉండేలా గుండు చేయించుకున్నాడు.భాజపా శ్రేణులతో తిరుగుతూ విన్నుత రీతిలో ప్రచారం చేస్తున్నాడు. నిజమాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆ యువకిడి అభిమానాన్ని ఒక సమావేశంలో అభినందించాడు. మోడీ మూడవసారి ప్రధాని అవ్వనున్నట్లు ఆ యువకుడు ఆశభావం వ్యక్తం చేస్తున్నాడు.