Homeహైదరాబాద్latest Newsహాస్టల్ విద్యార్థులను చిన్నచూపు చూస్తే సహించేది లేదు.. ప్రభుత్వానికి హెచ్చరిక

హాస్టల్ విద్యార్థులను చిన్నచూపు చూస్తే సహించేది లేదు.. ప్రభుత్వానికి హెచ్చరిక

ఇదే నిజం, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా, బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గల తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ ఏకలవ్య వసతి గృహాల్లో సరైన ఆహారం అందివ్వక సరైన మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల బడుగు బలహీన పేద విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్నటి రోజున మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉడకని అన్నం, పురుగులు, రాళ్లు ప్రత్యక్షం అయ్యాయని, నీళ్ల చారు అందిస్తున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను చిన్నచూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులు భోజనం తినలేక పోతున్నామని ఉడకని అన్నం తింటే కడుపునొప్పి వస్తుందని తమ తల్లి తండ్రుల వద్ద ఏడుస్తూ అరిగోసలు పడుతున్నారని విద్యార్థులను వసతి గృహాల్లోకి పంపడానికి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారని, వెంటనే విద్యాశాఖ మంత్రిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని నియమించి విద్యార్థులకు వసతి గృహాల్లో సరియైన మౌలిక సదుపాయాలు కల్పించాలని వారికి న్యాయమైన ఆహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నెల రోజుల నుంచి త్రాగునీరు లేక స్నానాలకు కూడా నీరు లేక విద్యార్థులు స్నానాలు కూడా చేయడం లేదని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారి కంపు కొడుతున్నాయని అనారోగ్యాలకు గురవుతున్నారని వాపోయారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు కోడం వెంకటేష్, కోడి రోహిత్ సాయి, కోలాపురం అరవింద్, బైరగొని హర్షిత్, అభిషేక్, నవీన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img