ఇదేనిజం, జుక్కల్: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాసా బాలకిషన్ అనే కళాకారుడు ప్రతి పండుగ ఉత్సవాలకు రకరకాల చిత్రాలు బదాం ఆకుపైన గీయడం అతని మహిమకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం మహాశివరాత్రి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ కళాకారుడు బాదాం ఆకుపై శివుని చిత్రం గీసి అందరిలో ఆకర్షితుడయ్యాడు. ఈ కళాకారుడు మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు వచ్చాయి అంటే దానికి సంబంధించిన చిత్రాలు తయారుచేస్తూ అందరినీ ఇతను ఆకట్టుకుంటున్నాడు. బాదం ఆకుపై గీసిన శివుని చిత్రాన్ని చూసి కళాకారునికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియజేస్తున్నారు.