Homeహైదరాబాద్latest NewsLosAngeles : మంటల్లో లాస్ ఏంజిల్స్.. రోడ్లపైకి హాలీవుడ్‌ యాక్టర్స్..!!

LosAngeles : మంటల్లో లాస్ ఏంజిల్స్.. రోడ్లపైకి హాలీవుడ్‌ యాక్టర్స్..!!

LosAngeles: అమెరికాలో లాస్ ఏంజిల్స్ మంటల్లో చిక్కుకుంది. అడవిలో మొదులైన ఈ కార్చిచ్చు నగరంలోకి ప్రవేశించింది. దాదాపు ఐదు ప్రాంతాల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. తాజాగా హాలీవుడ్‌ హిల్స్‌లో మరో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా, లాస్ ఏంజిల్స్‌లోని (LosAngeles) ఇళ్ళు మరియు దుకాణాలు కాలిపోతున్నాయి. ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరోలు అంత లాస్ ఏంజిల్స్ నే నివసిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో పలువురు హాలీవుడ్ నటీనటుల ఇళ్లు కూడా దగ్ధమైనట్లు తెలుస్తుంది. సుమారు 3 వేల ఎకరాల్లో ఎగసిపడుతున్న ఈ మంటలను ఆర్పేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు. లాస్ ఏంజిల్స్ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ అగ్నిప్రమాదంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. లాస్ ఏంజిల్స్ అగ్నిప్రమాదం కారణంగా ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ కూడా వాయిదా వేశారు.

Recent

- Advertisment -spot_img