Homeహైదరాబాద్latest Newsసమస్యల నిలయంగా ఎస్టీ కాలనీ

సమస్యల నిలయంగా ఎస్టీ కాలనీ

ఇదే నిజం, వేమనపల్లి : సమస్యల నిలయంగా ఎస్టీ కాలనీ మారిందని వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామపంచాయతీలోని ఎస్టీ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా సరైన డ్రైనేజీ నిర్మాణం లేక ఇక్కట్లకు గురవుతున్నామని చెబుతున్నారు. దగ్గర్లో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ లీక్ అవడంతో ఇండ్లలోకి నీరు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అధికారుల ఎన్నిసార్లు విన్నివించినా సమస్యలు పరిష్కారమవడం లేదని వాపోతున్నారు.

చెడిపోయిన బోర్ పంపు

ఎస్టీ కాలనీలో ఏప్రిల్ నెలలో బోరు చెడిపోవడంతో అసలే ఎండాకాలం నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు అధికారులకు విన్నవించుకోగా దగ్గర్లో ఉన్న వాటర్ ట్యాంక్ కి మోటార్ ద్వారా ఎక్కించి సరఫరా చేస్తున్నారు. ఓకే మోటార్ కు ఇంటి వరకు పైపులైను ఇచ్చుకొని అవసరాలకు ఉపయోగపడుతున్నాయి కానీ త్రాగు నీటికి ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు అధికారులు స్పందించి బోరు బాగు చేయాలని కోరుతున్నారు.

‘మిషన్ భగీరథ పైప్ లైన్ వాటర్ ట్యాంక్ కి ఎక్కే పైపులైన్ లీకేజీల వలన మురుగునీరంతా కాలనీల్లోని ఇండ్లలోకి నీరు ప్రవహిస్తోందనీ కాలనీవాసులు వాపోతున్నారు.అలాగే కాలనీలో మురుగునీరు ఖాళీగా ఉన్న జాగాల్లో పేరుకుపోయి మడుగును తలపిస్తోంది. ఈ నీరు నిలువ ఉండడంతో దుర్వాసనతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇప్పుడే ఇలా ఉంటే వచ్చేది వర్షాకాలం పగలు రాత్రి తేడా లేకుండా దోమల బెడద తప్పడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి’ – కాలనీవాసి నల్లి శంకర్

‘గ్రామపంచాయతీ అధికారులు తమ సమస్యల్ని పరిష్కరించడం లేదు. కాలనీలో సమస్యలను తెలుసుకోవడానికి వస్తున్నారు. పోతున్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదు. డ్రైనేజీలు లేక, దోమలతో ఇబ్బంది పడుతున్నాం. కనీసం కాలనీలో దోమల నివారణ మందు కూడా కొట్టడం లేదు. తక్షణమే అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణం చేయాలి’ – మాజీ వార్డు సభ్యులు కొద్దున ముసలయ్య

కాలనీవాసుల దయనీయమైన పరిస్థితి:

‘మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ వల్ల ఎస్టీ కాలనీలో దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. వచ్చేది వర్షకాలం. అధికారులు దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా గ్రామపంచాయతీ సిబ్బంది స్పెషల్ అధికారి స్పందించి కాలనీవాసుల ఇబ్బందులు లేకుండా చూడాలని వేడుకుంటున్నాం’ – గ్రామ నాయకులు కామెర గణేష్

సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం:

ఎస్టీ కాలనీలోని సమస్యలు మా దృష్టికి వచ్చాయి.ఆ కాలనీలో ఇప్పటికే మిషన్ భగీరథ నీరు లీకు కావడం జరుగుతుంది. లీక్ కాకుండా చూస్తానని అన్నారు
– ముల్కలపేట గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రీపతి బాబురావు

Recent

- Advertisment -spot_img