ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం గూడెం చెందిన యువతీ, యువకుడు కొద్దీ కాలం ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యుల వరకు వెళ్లింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు. దీంతో ఇద్దరు విడిపోయి ఉండలేక, ఇద్దరు కలిసి చావాలనే నిర్ణయించుకున్నారు. దీంతో కరీంనగర్ వెళ్లి అక్కడ ఉజ్వల పార్క్ లో పెళ్లి చేసుకొని, అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అబ్బాయి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ లో ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు యువకుడు పెంటం చందు(23) మృతి చెందాడు. దీంతో గూడెం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం యువతి ఎల్లారెడ్డి పేట్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతుందని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.