కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. సురేష్ (44), అనూష (24).. వారిద్దరూ ప్రేమించుకున్నారు. చిన్న గొడవల కారణంగా అనూష సురేష్‌కి దూరంగా ఉంటుంది. అయితే గురువారం సాయంత్రం సురేష్ ఆమెను పార్క్‌లో కలవాలని పిలిచాడు. అనూష వచ్చాక అతనికి దూరంగా ఉంటుందన్న కోపంతో కత్తితో పొడిచి చంపేశాడు. కూతురి కోసం వచ్చిన తల్లి.. తన కూతురిని చంపాడనే కోపంతో సురేశ్ తలపై రాయితో కొట్టి చంపేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు జంట హత్యలపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.