అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో రానున్న 3రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం ప్రకటించింది. బుధవారం పలు జిల్లాల్లో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఏర్పడొచ్చని వెల్లడించింది. రాబోయే ఐదు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది.