Homeతెలంగాణతెలంగాణలో నేటి నుంచి LRS మేళాలు

తెలంగాణలో నేటి నుంచి LRS మేళాలు

హైద‌రాబాద్ః అక్రమ ప్లాట్లు/ లే అవుట్‌లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ లపై అవగాహన కల్పించేందుకు ప్రతి మంగళ, శనివారాల్లో మేళాలు నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసేంత వరకు ప్రతి మంగళ, శనివారాల్లో మునిసిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాలను నిర్వహించాలని కమిషనర్‌లను తెలంగాణ మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు, పట్టణ ప్రణాళికా విభాగం జిల్లా అధికారులకు సూచించారు. మరో వైపు అక్రమ లే-అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బందులు తెచ్చుకోవద్దని,అధికారులు సూచిస్తుస్తున్నారు. అంతేకాదు రియల్టర్లు సైతం అక్రమ లే-అవుట్లను ఎల్‌ఆర్‌ఎస్‌తో క్రమబద్ధీకరించుకోవాలన్నారు. ఈసారి ఎల్ఆర్ఎస్ అవకాశం కేవలం నూతన మున్సిపాల్టీలు, మున్సిపాల్టీల్లో విలీనమైన గ్రామాలకు మాత్రమే అని గతంలోనే మార్గదర్శకాలు జారీచేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img