LSG : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు అటల్ బిహారి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ , గుజరాత్ టైటాన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెంట్స్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆ తరువాత 181 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నో నిర్ణత 19.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి విజయం సాధించింది. లక్నో బ్యాటర్లు నికోలస్ పూరన్ 61 పరుగులు, మార్క్రమ్ 58 పరుగులు, ఆయుష్ బదోని 28, రిషబ్ పంత్ 21పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.