LSG vs PBKS : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా నేడు ఏకనా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడిపోయిన లక్నో బ్యాటింగ్ దిగింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు లక్నో రెండు మ్యాచ్‌లు ఆడింది. వాటిలో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. పంజాబ్ జట్టు ఆడిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించింది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (c/wk), డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ జట్టులో ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), శ్రేయాస్ అయ్యర్ (c), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, లాకీ ఫెర్గూసన్ ఉన్నారు.