Homeహైదరాబాద్latest NewsLubber pandhu : తెలుగులో ఉంది కదా.. ఎందుకు మళ్ళీ రీమేక్..?

Lubber pandhu : తెలుగులో ఉంది కదా.. ఎందుకు మళ్ళీ రీమేక్..?

Lubber pandhu : సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు రీమేక్ సినిమాలు తీసి హిట్టు కొడతారు. అయితే ఆ సినిమాలు వేరే భాషలో రిలీజ్ కావడంతో అవ్వి తెలుగులో అందుబాటులో లేకపోవడంతో రీమేక్ చేస్తే బాగుటుంది. కానీ ఒక సినిమా తమిళ భాషలో విడుదలై ఘన విజయం సాధించి.. ఆల్రెడీ తెలుగులో కూడా ఓటిటిలో వచ్చి మంచి హిట్ కొట్టింది. అయితే ఆ సినిమాని మరోసారి తెలుగులో రీమేక్ చేయాలనీ ఒక హీరో ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమానే ”లబ్బర్ పందుని”.. ఈ సినిమాలో హరీశ్ కల్యాణ్, అట్టకత్తి దినేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ స్పోర్ట్స్ డ్రామా చిత్రం, తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వంలో 2024 సెప్టెంబరు 20న విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద దాదాపు 40 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం తెలుగులో డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

తాజాగా ఈ సినిమాని తెలుగులో హీరో శర్వానంద్ రీమేక్ చేయబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరో రాజశేఖర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో శర్వానంద్, రాజశేఖర్ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ ఆధారంగా సాగే ఈ సినిమా కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి రీమేక్ చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img