Homeహైదరాబాద్latest News'లక్కీ భాస్కర్' మూవీ ట్రైలర్ రిలీజ్…'వాటి కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ' అంటున్న...

‘లక్కీ భాస్కర్’ మూవీ ట్రైలర్ రిలీజ్…’వాటి కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ’ అంటున్న దుల్కర్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తాను చేసిన సినిమాలోని వివిధ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సినిమా ‘లక్కీ భాస్కర్’. సోమవారం, మేకర్స్ ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ట్రైలర్‌ వేడుక ఘనంగా జరిగింది. బ్యాంకింగ్ రంగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఒక వ్యక్తి జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యతను చెప్తుంది. ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో లక్కీ భాస్కర్ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img