Homeహైదరాబాద్latest Newsఇద్దరు మహిళలపై పిచ్చికుక్క దాడి

ఇద్దరు మహిళలపై పిచ్చికుక్క దాడి

ఇదే నిజం, కోరుట్ల : మల్లాపూర్ మండలం ముత్యం పేట గ్రామంలో పిచ్చికుక్క దాడిచేసి ఇద్దరు మహిళలను తీవ్రంగా గాయపరిచింది. వివరాల్లోకి వెళితే..
ముత్యంపేటలో మంగళవారం(మే 21) మధ్యాహ్నం ఓ ఇంట్లోకి చొరబడి పిచ్చికుక్క దాడి చేసింది.
వాకిటి గంగవ్వ (75) అనే వృద్ధురాలు, మారు రాజశ్రీ (40) ఇద్దరిని కరిచింది. తీవ్రంగా గాయాలపాలు కావడంతో స్థానికులు హుటాహుటిన మెట్‌పల్లి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా..గ్రామ సంబంధిత ప్రత్యేక అధికారులు స్పందించి ఆ పిచ్చి కుక్కని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అసలే వేసవి సెలవులు, పిల్లలు కూడా ఆరుబయటే ఆడుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రతీ ఒక్కరు భయాందోళనకు గురవుతున్నారు.

Recent

- Advertisment -spot_img