Homeహైదరాబాద్latest Newsకుక్కలు బాబోయ్‌.. రాయికల్ లో పిచ్చికుక్కల స్వైరవిహారం.. పట్టిచుకొని అధికారులు

కుక్కలు బాబోయ్‌.. రాయికల్ లో పిచ్చికుక్కల స్వైరవిహారం.. పట్టిచుకొని అధికారులు

ఇదేనిజం, రాయికల్: కుక్కలు బాబోయ్‌ కుక్కలు..రాయికల్ లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు మీద పడి దాడి చేస్తున్నాయి. తాజాగా రాయికల్ లోని కేశవ నగర్ 7వ వార్డ్ లో ఒక్కేరోజు12 మందిని కరిచి కుక్కలు బీభత్సం సృష్టించిన విషయం అందిరికి తెలిసిందే .. పిల్లలను పని మీద బయటకు పంపించాలంటే భయం ఏ కుక్క ఎటువైపు నుంచి దూసుకొస్తుంది అని ఆడుకోవడానికి ఇంటి ముందు ఉన్న ఆందోళనే పెద్దలైన ఒంటరిగా అడుగు పెట్టాలన్న భయభ్రాంతులకు గురవుతున్నారు. వర్షాకాలం వస్తే చాలు వీధి కుక్కల ప్రవర్తన అసాధారణంగా ఉంటుంది ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ అధికారులు శునకాలకు సంతాన నిరోధక శాస్త్రచికిత్సలు రేబిస్ టీకాలు ఇప్పించమని రాయికల్ ప్రజలు కోరుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img