HomeతెలంగాణMade in india : అందుబాటులో స్వదేశీ 5జీ స్మార్ట్‌ఫోన్‌..

Made in india : అందుబాటులో స్వదేశీ 5జీ స్మార్ట్‌ఫోన్‌..

Made in india 5g smart phone available : అందుబాటులో స్వదేశీ 5జీ స్మార్ట్‌ఫోన్‌..

దేశీయ మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్‌.. మార్కెట్‌లోకి సరికొత్త 5జీ Made in india స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది.

దీంతో భారతీయ వినియోగదారుల కోసం 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చిన తొలి దేశీయ బ్రాండ్‌గా లావా రికార్డులకెక్కింది.

‘అగ్ని’ పేరుతో పరిచయమైన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.19,999గా ఉన్నది. నోయిడా ప్లాంట్‌లో దీన్ని తయారు చేస్తున్నట్లు ఈ సందర్భంగా లావా ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు, వ్యాపారాధిపతి సునీల్‌ రైనా తెలిపారు.

హై డ్యూరబిలిటి గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, 5000 మెగాహెట్జ్‌ బ్యాటరీ, 30వాట్ల సూపర్‌ఫాస్ట్‌ చార్జర్‌, 90 నిమిషాల్లోపే ఫుల్‌ చార్జింగ్‌ దీని ప్రత్యేకతలన్నారు.

ప్రీ-బుకింగ్‌లో రూ.17,999కే

ఈ నెల 17 వరకు ప్రీ-బుకింగ్స్‌ అందుబాటులో ఉంటాయని, లావా ఈ-స్టోర్‌, అమెజాన్‌లలో రూ.500 లు చెల్లించి బుక్‌ చేసుకున్నవారికి రూ.17,999లకే లభిస్తుందని రైనా తెలిపారు.

18 నుంచి అన్ని రిటైల్‌ ఔట్‌లెట్లు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుక్కోవచ్చన్నారు.

అగ్ని 5జీ Made in india స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు

  • 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
  • 8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ
  • 16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా
  • 64 మెగాపిక్సల్‌ ప్రైమరీ కెమెరా
  • ఒక 5 మెగాపిక్సల్‌, రెండు 2 మెగాపిక్సల్‌ కెమెరాలు

Recent

- Advertisment -spot_img