టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరుగవు
నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన కామెంట్స్
హైదరాబాద్: బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్ వాడుతున్నారంటూ సంచలన నటి కంగనా రనౌత్ చేసిన ఆరోపణలకు దేశ వ్యాప్తంగా పలువురు నుంచి మద్దతు లభిస్తుంది. కంగనా చేసిన వ్యాఖ్యలను నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సమర్థిస్తూ తన ఫేస్బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టారు. టాలీవుడ్‌లోనూ డ్రగ్స్ వ్యవహారం నిత్యకృత్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో అసలు డ్రగ్స్ లేకుండా పార్టీలు కూడా జరగవని చెప్పారు. “సుశాంత్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అడుగు పెట్టడం మంచి పరిణామమన్నారు. కానీ చివరికి ఇదిగో అదిగో అని ఫైనల్‌గా తుస్సుమనిపిస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. 2009లో డ్రగ్స్ కేసును డీల్ చేసిన ఆఫీసర్ నోరు నొక్కేసి వేరే శాఖకు బదిలీ చేశారని గుర్తు చేశారు. సినిమా వాళ్లు, పబ్స్, విద్యార్థులు మాదక ద్రవ్యాల వారికి భారీగా ఆదాయాన్ని పెంచుతున్నారని, వీరిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఓ కన్నేసీ ఉంచాలన్నారు. ఇంకా ‘అమ్మో నాకు భయంగా ఉంది. ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో?’ అని భయం వ్యక్తం చేసింది. ఎవరు డ్రగ్స్ జోలికి పోరని, అధికారులు కూడా చూసీ చూడనట్లే ఉంటారని, ఒకవేళ నిజంగా పట్టుకున్నా పెద్ద వాళ్లతో గొడవెందుకులేనిని వదిలేస్తారన్నారు. ఎవరైనా ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ప్రభుత్వాలు ఎలాగూ వదిలేయి అని ఆఫీసర్లను భయపెడతాయన్నారు. ‘సరేలే.. నాకేమన్నా అయితే చట్టం చేతకానితనం అని నేనే కేసు పెట్టాల్సి వస్తుందో ఏమో..” అని టాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియాపై వ్యంగ్యంగా రాసుకొచ్చారు.
అమ్మో నాకు భయంగా ఉంది
RELATED ARTICLES