– 50 వేల మెజార్టీతో గెలుస్తా
– పేదల కోసమే ఆరు గ్యారెంటీలు
– సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: మధిర పోరాటాల పురిటగడ్డ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మధిరలో తన గెలుపు ఖాయమైందని పేర్కొన్నారు. 50 వేల మెజార్టీతో గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మధిరలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. 100 మంది కేసీఆర్‌లు వచ్చినా తనను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. ఫ్యూడల్ ప్రభుత్వమైన బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలపాలని, ప్రజల సర్కార్‌ను అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం ఎర్పడిన తర్వాత తెలంగాణ సంపద అందరికీ సమానంగా అందుతుందని భావిస్తే.. బీఆర్ఎస్ నేతలు మాత్రమే దాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.