Homeఫ్లాష్ ఫ్లాష్'Mad' with decent openings డీసెంట్​ ఓపెనింగ్స్​తో దూసుకెళ్తున్న‘మ్యాడ్’

‘Mad’ with decent openings డీసెంట్​ ఓపెనింగ్స్​తో దూసుకెళ్తున్న‘మ్యాడ్’

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్​లు హీరోలుగా గౌరీ ప్రియ, ఆనంతిక, గోపిక ఉదయన్​లు హీరోయిన్స్ గా దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన కంప్లీట్ ఎంటెర్టైనర్ ‘మ్యాడ్’. టీజర్, ట్రైలర్​తో​ ఆకట్టుకున్న ఈ మూవీ గత శుక్రవారం థియేటర్లలోకి రిలీజై డీసెంట్ ఓపెన్సింగ్​ను తెచ్చుకుంది. మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ గా రెండో రోజు మరింత సాలిడ్ నంబర్స్ తో ఫస్ట్ డే కంటే బెటర్​గా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 4.7 కోట్ల గ్రాస్ ని నమోదు చేసింది. ఈ క్రేజీ మ్యాడ్ రైడ్ కి మాత్రం ఇవి అదిరే నంబర్స్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు నిర్మించారు.

Recent

- Advertisment -spot_img