ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని పదర మండలం రాయలగండి గ్రామంలోని లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, అనురాధ దంపతులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ యువనాయకుడు శ్రీకాంత్, భీమ దంపతులు హాజరై కల్యాణంలో పాల్గొన్నారు. మాల మహానాడు, మాల ఉద్యోగుల ఐక్యవేదిక తరపున లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి మునకు తలంబ్రాల బియ్యం ను మాల మహానాడు భవనం నుంచి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు కలుముల బాలస్వామి, మాల మహానాడు ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షులు అంజి , ప్రధాన కార్యదర్శి రవీందర్ , నిరంజన్ , వెంకటేశ్వర్లు , లక్ష్మీనారాయణ, జీవన్ కుమార్, శ్రీనివాసులు, కపిల్ దేవ్, రవి, నారాయణ, రామస్వామి, శ్రీను, తిరుపతయ్య, శ్రీశైలం , చంద్రమౌళి, సామవెంకటేష్ ,మోహన్, జానకిరామ్, రాధమ్మ, ఝాన్సీ కపిల్, గోపాలమ్మ, శశికళ, రత్నమాల, మాధవి, పద్మ, ఝాన్సీ, లక్ష్మీకాంతమ్మ, విజయ, సునీత, ఇందిరమ్మ, పార్వతమ్మ, రమ్య, శకుంతల, భారతి, ఈదమ్మ, అరుణమ్మ రమాదేవి, సుగుణ, విజయ, కమలమ్మ, సౌందర్య, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.