ఇదే నిజం, దేవరకొండ: యన్ ఎస్ యు ఐ జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి పిలుపు మేరకు యన్ ఎస్ యు ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వెంకటస్వామి నాయకత్వంలో నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్ అద్వర్యంలో జాతి పిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో శాంతియుతంగా అనేక ఉద్యమాల నిర్వహించి దేశ స్వాతంత్రం తేవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మహోన్నత వ్యక్తి గాంధీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిఏ పల్లి మండల అధ్యక్షులు మునగాల శివ, భూతం అజయ్ , విజేయుడు, వాల్ సింగ్, ఎలుక జాలెందర్, సయ్యద్ మొయిన్, కుంభం మధు, రామవత్ వంశి, యెనిమల రమేష్, నాగార్జున, రాహుల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.